ఉపాసన భావోద్వేగపు పోస్ట్.. జీవితానికి కావలసిన అతి ముఖ్యమైన పాఠం..

గత కొన్ని రోజులుగా అన్నీ విషాద వార్తలే.. మనసుని కలవర పరుస్తున్నాయి. మా కుటుంబంలోని ముగ్గురు పెద్దవాళ్లు కన్నుమూశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త విన్నాం. కోవిడ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశాన్ని కాపాడేందుకు జవాన్లు తమ ప్రాణాల్ని త్యాగం చేశారు. వారం రోజుల క్రితం మా వివాహ ఎనిమిదో వార్షికోత్సవం. కానీ ఆరోజును సెలబ్రెట్ చేసుకోలేకపోయాం. చేసుకోవాలన్న ఆసక్తి లేదు. మూడు రకాల ఆవకాయ పచ్చళ్లు వేసుకుని అన్నం తిన్నా. కొన్ని చిప్ప్ తిన్నాం.. ఇంట్లోనే టీవీ చూశాం. ఈ సమయంలో జీవితానికి కావలసిన అతి ముఖ్యమైన పాఠాల్ని నేర్చుకున్నాం అని ఉపాసన పేర్కొన్నారు. తను షేర్ చేసిన ఫోటోలోని ప్రతి వస్తువు ఓ కొత్త విషయాన్ని తెలుపుతుందని తన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు.
View this post on Instagram
A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com