కరోనా నివారణకు మరో మందు.. ఒక్కో డోసు ధర రూ.6 వేలు..!!

కరోనా నివారణకు మరో మందు.. ఒక్కో డోసు ధర రూ.6 వేలు..!!
X

కరోనా నివారణకు మరో మందు సిద్దమైంది. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం హెటెరో డ్రగ్స్... కొవిడ్-19 చికిత్సకు ఉపయోగపడే యాంటీ వైరల్ ఔషధాన్ని రెడీ చేసింది. ఆ మెడిసిన్ పేరు కొవిఫర్‌. ఇది ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. ఇది రెమ్‌డెసివర్‌ జెనరిక్ వర్షన్. కొవిఫర్ బ్రాండ్ పేరుతో రెమ్‌డెసివర్ జెనరిక్ వర్షన్‌ తయారీ, మార్కెటింగ్‌కు డ్రగ్ కంట్రో లర్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఈ ఔషధం 100 ఎంజీ ఇంజెక్షన్ రూపంలో అందుబాటులోకి వస్తుంది. ఒక్కో డోసు ధర 5 వేల నుంచి 6 వేలు ఉంటుందని హెటెరో డ్రగ్స్ పేర్కొంది. ఆస్పత్రులు, ప్రభుత్వం ద్వారా మాత్రమే ఈ మెడిసిన్‌ను అందచేస్తారు. పెద్దలు, పిల్లలు, తీవ్రమైన కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరినవారికి ఈ మెడిసిన్‌ను ఉప యోగించవచ్చని హెటెరో డ్రగ్స్ తెలిపింది. కొన్ని వారాల్లోనే లక్ష డోసులు అందించడానికి ప్రయత్నిస్తున్నామని హెటి రో డ్రగ్స్ వివరించింది. దేశంలో కొవిడ్-19 కేసులు భారీగా వస్తున్న సమయంలో కొవిఫర్‌కు అనుమతి లభించడం గేమ్ ఛేంజర్‌లా మారుతుందని హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ బి.పార్థసారధి రెడ్డి తెలిపారు.

కొవిఫర్ ఇంజెక్షన్ మెడికల్ షాప్‌లలో దొరకదు. వైద్యుల పర్యవేక్షణలోనే రోగులకు వాడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ద్వారా నేరుగా కరోనా చికిత్స అందిస్తున్న ఆస్పత్రులకు కొవిఫర్‌ను సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకుంటామని హెటెరో డ్రగ్స్ తెలిపింది. ప్రభుత్వం కోరినన్ని డోసులు సరఫరా చేయడానికి సిద్దంగా ఉన్నామని, ఉత్పత్తి కూడా ప్రారంభమైందని హెటెరో డ్రగ్స్ పేర్కొంది. తమ ఉత్పత్తి ప్రక్రియ మొత్తం మేకిన్ ఇండియాకు అనుగుణంగా ఉంటుందని హెటెరో డ్రగ్స్ వివరించింది.

మరో డ్రగ్ ఫార్మా దిగ్గజం సిప్లా కూడా కరోనా నివారణకు ఉపయోగపడే మెడిసిన్‌ను సిద్ధం చేసింది. ఆ ఔషధానికి కూడా డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే గ్లెన్ మార్క్ కంపెనీ ఫ్యావిపిరవిర్ పేరుతో యాంటీ వైరల్ టాబ్లెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ మెడిసిన్‌ను ఆల్రెడీ ముంబైలో ఉపయోగిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో హైదరాబాద్ మార్కెట్‌లో, వారం రోజుల్లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ మెడిసిన్‌ టాబ్లెట్ రూపంలో ఉంటుంది. ఒక్కో టాబ్లెట్ ధర 103 రూపాయలు. స్వల్ప, మధ్యస్థాయి కరోనా లక్షణాలు ఉన్నవారికి ఈ టాబ్లెట్లను వాడవచ్చు.

Next Story

RELATED STORIES