చైనాకు చెందిన టిక్ టాక్ పోటీగా భారత యాప్.. 72 గంటల్లోనే 5 లక్షల డౌన్ లోడ్లు

చైనాకు చెందిన టిక్ టాక్ పోటీగా భారత యాప్.. 72 గంటల్లోనే 5 లక్షల డౌన్ లోడ్లు

చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ కు పోటీగా భారత యాప్ వచ్చేసింది. రావటమే కాదు..వచ్చిన కొద్ది గంటల్లోనే ట్రేడింగ్ లో దూసుకుపోతోంది. గంటల వ్యవధిలో లక్షల డౌన్ లోడ్లతో టిక్ టాక్ కు మతి పోగోడుతోంది. మన భారతీయుడు తయారు చేసిన ఆ యాప్ పేరు చింగారి. మన దేశంలో ఫుల్ క్రేజ్ ఉన్న టిక్ టాక్ కు పోటీగా వచ్చిన చింగారి యాప్ ను కేవలం 72 గంటల్లోనే 5 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం డౌన్‌లోడ్ల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. డౌన్ లోడ్స్ పెరుగుతుండటంతో చింగారి గూగుల్ ట్రెండింగ్ లో దుమ్మురేపుతోంది. ప్లే స్టోర్ లో ఒకటో స్థానంలో నిలిచింది.

గాల్వాయ్ ఘర్షణ చైనాపై జనం ఆగ్రహంతో ఉన్నారు. ఏది ఏమైనా సరే చైనా ఉత్పత్తులకు భారత్ లో స్థానం లేకుండా చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని ఊదరగొట్టేస్తున్నారు. బాయ్ కాట్ చైనా పేరుతో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వచ్చిన చింగారికి అనూహ్యంగా ఆదరణ పెరిగిపోయింది. చింగారి ఇంత ఆదరణ లభిస్తుందని తాము ఊహించలేకపోయామని అంటున్నారు యాప్ డెవలపర్ బిశ్వాత్మ నాయక్. టిక్ టాక్ కు ప్రత్యామ్నాయం వెతుకుతున్న సమయంలో మేం దానికి మించి మంచి ఫీచర్లతో చింగారి యాప్ రూపొందించామని చెబుతున్నారు. ఈ యాప్‌లో ఉన్న మ‌రో ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో ఎవ‌రి వీడియోలు వైర‌ల్ అవుతాయో వారికి పాయింట్లు ల‌భిస్తాయి. దీన్ని డ‌బ్బులుగా మార్చుకునే అవకాశం కూడా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story