ట్రంప్ కీలక నిర్ణయంపై భారతీయుల్లో టెన్షన్

అమెరికాలో వర్క్ వీసాల రద్దు నిర్ణయంపై భారత టెక్కీల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో మినహాయింపుల్లేకుంటే వారంతా వెనక్కి రావాల్సి ఉంటుంది. నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు విదేశీ వృత్తి నిపుణులకు జారీ చేసే H-1-B సహా అన్ని వర్క్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయాల్లో గుబులు రేపుతోంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన భారతీయ గ్రాడ్యుయేట్లకు సైతం కంటిమీద కునుకులేకుండా పోయింది. గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ - OPT వర్క్ పర్మిట్‌తో ఉద్యోగం చేస్తున్న దాదాపు 25 వేల మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఈ సారి H-1-B రాకపోతే స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సి ఉంటుంది.
H-1-B సహా అన్ని రకాల వర్క్ వీసాల రద్దుపై ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని ఈ మధ్యే ట్రంప్ స్పష్టం చేశారు. ఆమేరకు ఉత్వర్వులు వెలువడితే OPTపై పనిచేస్తూ చివరి అవకాశంగా H-1-B వీసా కోసం ఎదురుచూస్తున్న దాదాపు 40 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. వారిలో L-1పై అమెరికా వెళ్లిన 15 వేల మంది ఐటీ నిపుణులు కూడా ఉన్నారు. L-1 గడువు ముగుస్తున్న దశలో ఈ ఏడాది మార్చిలో H-1-Bకి అప్లై చేశారు. వారి దరఖాస్తులు లాటరీ దశలో ఎంపికై పరిశీలన దశలో ఉన్నాయి. ఇప్పుడు హఠాత్తుగా ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వారిని చిక్కుల్లో పడేసింది. కొత్తగా వెలువడనున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎలా ఉండబోతుందున్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం H-1-B వీసాపై పనిచేస్తున్న ఐటీ నిపుణుల రెన్యువల్ దరఖాస్తుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నప్పటికీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెలువడే దాకా చెప్పలేమంటున్నారు
ఈ ఏడాది మార్చిలో దాదాపు 1.67 లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులు H-1-B వీసాలకు దరఖాస్తు చేయగా వారిలో 70 వేల మంది లాటరీలో ఎంపికయ్యారు. వారికి వీసాలు జారీ చేసే ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది. సాధారణంగా జూన్ నుంచి లాటరీ ద్వారా ఎంపికైన వారికి H-1-B వీసాలు జారీ చేస్తారు. అయితే ఈ సారి కరోనా కారణంగా అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ కార్యాలయాలు మూతపడ్డాయి. అయినా దాదాపు 8 వేల మందికి H-1-B వీసాలు మంజూరయ్యాయి. మిగిలిన వారి అప్లికేషన్లు పరిశీలిస్తున్న సమయంలో... ట్రంప్ స్వరం మారింది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తర్వాత వర్క్ వీసాలు రద్దయితే లాటరీలో ఎంపికైన దరఖాస్తులను పరిశీలించే అవకాశం లేదు.
RELATED STORIES
Drone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMTIndia Post Payments Bank(IPPB) GDS Recruitment 2022: డిగ్రీ అర్హతతో ...
12 May 2022 4:30 AM GMT