కరోనా ఎఫెక్ట్.. మూడు నెలల తరువాత ఇళ్ల రేట్లు..

కరోనా ఎఫెక్ట్.. మూడు నెలల తరువాత ఇళ్ల రేట్లు..

వచ్చే అక్టోబరు, నవంబరు నాటికి రియల్ ఎస్టేట్ రంగం సాధారణ స్థాయికి చేరుకుంటుందని రియల్టర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లు, ఇళ్ల ధరలు తగ్గే అవకాశం లేదంటున్నారు. కొత్త ప్రాజెక్టులు ఇంకా ఏమీ మొదలు పెట్టలేదు. వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఉన్నవారితోనే ఆగిపోయిన నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. దాంతో కూలీల రేట్లు కూడా 50 శాతం పెరిగాయి. వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధి దొరికే రంగం భవన నిర్మాణ రంగం. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లినా అక్కడ వారికి ఆయా రాష్ట్రాలు పని కల్పించే స్థితిలో లేవు. దాంతో తిరిగి నగరానికి రావాలంటే ప్రభుత్వం వారికి భరోసా కల్పించాలి.

లాక్డౌన్ సడలింపుల అనంతరం కొనుగోళ్ల సంఖ్య పెరగడం శుభపరిణామని అంటున్నారు. భవన నిర్మాణానికి సంబంధించిన ముడిసరుకు ధరలు 50 నుంచి 60 శాతం పెరగడంతో ఇళ్ల ధరలు తగ్గించే అవకాశం లేదంటున్నారు. గత మూడు నెలల్లో ఐటీ, ఫార్మా రంగాల్లో ఎవరూ ఉద్యోగాలు కోల్పోలేదు. అందరూ వర్క్ ఫ్రం హోం చేసి ఆయా కంపెనీలను లాభాల బాటలోనే ఉంచాయి. ఇది రియల్ ఎస్టేట్ కి కలిసి వచ్చిన అంశం. నిర్మాణరంగం పుంజుకుంటుంది. భూముల ధరలూ తగ్గుతాయి. భవిష్యత్తులో ఇళ్ల ధరలూ తగ్గవచ్చంటున్నారు.

హైదరాబాదులో ఇళ్ల ధరలు, విలువను బ్యాంకులేవీ తగ్గించలేదని చెబుతున్నారు. ఇది శుభపరిణామమేనని అంటున్నారు. అయిత మారటోరియం వల్ల కొన్ని బ్యాంకులు రుణాలివ్వడం లేదు. ఇతర నగరాలకంటే హైదరాబాద్ నగంలో ఇల్లు కొనుగోలుకే మొగ్గు చూపుతుంటారు నగర వాసులు. రియల్ ఎస్టేట్ రంగంపై 250 పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. వాటికి సరైన ఆసరా లేకపోతే అవి కుప్పకూలుతాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని సాయం చేసే ప్యాకేజీని ప్రభుత్వం తేవాలి అని రియల్టర్లు ఆశిస్తున్నారు.

ఇంటి రుణాలు 7 నుంచి 8 శాతం వడ్డీతో ఇస్తున్నారు. దీన్ని కూడా కొంత తగ్గిస్తే కొనుగోలు దారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు. కరోనా రికవరీ రేటు పెరిగితే అక్టోబరు, నవంబరు నాటికి సాధారణ స్థాయికి రియల్ రంగం వస్తుంది. జీఎస్టీ తగ్గిస్తే అందరికీ ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే ముందు రియల్ ఎస్టేట్ రంగం ప్రభుత్వం దృష్టి సారించాలని నిర్మాణదారులు కోరుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story