ఈ ఔషధాన్ని వాడితే మరణాల సంఖ్య తగ్గుతుంది: డబ్లుహెచ్ ఓ

ఈ ఔషధాన్ని వాడితే మరణాల సంఖ్య తగ్గుతుంది: డబ్లుహెచ్ ఓ

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరోనా వైరస్ రోగులకు డెక్సామిథాసోన్ ఇస్తే మరణాల సంఖ్య తగ్గుతుందని డబ్లుహెచ్ ఓ తెలిపింది. అందుకే ఈ ఔషధ తయారీ ఉత్పత్తిని పెంచాలని పిలుపునిచ్చింది. సంస్థ చీఫ్ టెబ్రోస్ మాట్లాడుతూ.. ఈ ఔషధం బ్రిటీష్ ట్రయల్స్ లో మంచి ఫలితాన్ని ఇచ్చినట్లు నిరూపితం కావడంతో డిమాండ్ పెరిగిందని అన్నారు. గత వారం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ బృందం నేతృత్వంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 2 వేల మంది రోగులకు ఈ ఔషధాన్ని ఇచ్చారు. ఇది మరణాల సంఖ్యను 35 శాతం తగ్గించినట్లు తెలిసింది. పరిశోధనలు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నప్పటికీ కరోనా రోగుల ప్రాణాలను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నిరూపితమైంది.

అందుకే ఈ ఔషధం వాడకానికి అనుమతిస్తున్నాం అని టెడ్రోస్ అన్నారు. కాగా, డెక్సామిథాసోన్ 60 ఏళ్లుగా మార్కెట్లో ఉంది. సాధారణంగా ఈ ఔషధం మంటను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నవారికి ఈ మందు పనిచేస్తుందన్న ఆధారాలు లేవన్నారు. పైగా వాళ్లు వాడితే హాని కలిగించే ప్రమాధం కూడా ఉంటుందని హెచ్చరించారు. ఈ ఔషధం పేరుతో మార్కెట్లోకి నకిలీవి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నందున ఔషధ తయారీ దారులు నాణ్యతకు సంబంధించి హామీ ఇవ్వవలసి ఉంటుందని టెడ్రోస్ హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story