తాజా వార్తలు

తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 220..

తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 220..
X

తెలంగాణలో కరోనా మహమ్మరి రోజురోజుకు విజృంభిస్తోంది. మంగళవారం ఒక్క రోజే.. 879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 652 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 9వేల 553కు చేరింది. మరో ముగ్గురు చనిపోవడంతో.. ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 220కి చేరింది.

మేడ్చల్‌ 112, రంగారెడ్డి జిల్లాలో 64 కేసులు నమోదుకాగా.. వరంగల్‌ రూరల్‌ 14, వరంగల్‌ అర్బన్‌లో 9, కామారెడ్డి పది, జనగామలో 7 , నాగర్‌ కర్నూలు లో 4, మహబూబాబాద్‌, మంచిర్యాలా, సంగారెడ్డిలో రెండేసి కేసులు నమోదయ్యాయి. మొదక్‌ జిల్లాలో ఒక కరోనా కేసు నమోదైంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 5 వేల 109 కాగా, ఇప్పటివరకు 4 వేల 224 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Next Story

RELATED STORIES