తాజా వార్తలు

సూర్యాపేట జిల్లాలో భూప్రకంపనలు

సూర్యాపేట జిల్లాలో  భూప్రకంపనలు
X

సూర్యాపేట జిల్లా పరిధిలోని.. చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో... మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పలు మార్లు భూప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో.. జనం బెంబేలెత్తారు. ఐదు నుంచి పది సెకెన్ల పాటు భూమి మూడుసార్లు కంపించింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలోనూ భూ ప్రపంకపనలు వచ్చాయి. దీంతో అప్పట్లో భూ భౌతిక శాస్త్రవేత్తల బృందం బాధిత ప్రాంతాల్లో పర్యటించింది. నమూనాలు సేకరించి టెస్టింగ్‌ సైతం చేసింది. అయితే భూమిలోపల సర్దుబాట్లు వల్లే ఈ ప్రకంపనలు వస్తున్నాయని, భయపడాల్సిన అవసరం లేదంటూ అప్పట్లో తేల్చేశారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు మళ్లీ ప్రకంపనలు రావడంతో... పులిచింతల ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతాలైనా మళ్ల చెరువు, చింతలపాలెం, నెమలపురి ప్రాంతాల ప్రజలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES