అంతర్జాతీయం

ప్రపంచ వ్యాప్తంగా 94 లక్షలకు చేరిన కరోనా కేసుల సంఖ్య

ప్రపంచ వ్యాప్తంగా 94 లక్షలకు చేరిన కరోనా కేసుల సంఖ్య
X

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ నిబంధనలను ఎత్తివేయడంతో కొత్తగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసులు మరింతగా పెరుగుతున్నాయి. రెండు వారాలు గా ప్రతిరోజు లక్షకుపైనే నమోదవుతూ వస్తున్న పాజిటివ్‌ కేసులు గత 5 రోజుల నుంచి రోజుకు లక్షన్నర దాటుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో లక్ష 60 వేల పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తంగా కరోనా కేసుల కేసుల సంఖ్య 94 లక్షలకు చేరింది. అలాగే గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 5 వేల 431 మంది మరణించారు. దీంతో, మొత్తం కరోనా మరణాల సంఖ్య 4 లక్షల 80 వేలకు పెరి గింది.

ఇక, దాదాపు అన్ని దేశాల్లో రికవరీ రేటు పెరిగింది. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నవారి కంటే కూడా డిశ్చార్జ్ అవుతున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. కరోనా బారిన పడిన వారిలో 50 లక్షల 42 వేల మంది చికిత్స తర్వాత ఇళ్లకు వెళ్లిపోయారు. మరో 38 లక్షల 33 వేల మంది చికిత్స పొందుతున్నారు. మొత్తంగా యాక్టివ్ కేసుల కంటే డిశ్చార్జ్‌డ్ కేసులు 12 లక్షలు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో రికవరీ రేటు ఇంకా పెరుగుతుందని, కరోనా విషయంలో ప్రజలు బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదనే వాదన వినిపిస్తోంది. కరోనా గురించి టెన్షన్ పడకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని చెబుతున్నారు.

అమెరికాలో కరోనా వ్యాప్తి మళ్లీ ఉధృతమవుతోంది. మంగళవారం ఒక్కరోజే దేశంలో సుమారు 36 వేల పాజిటివ్ నమోదయ్యాయి. దీంతో అగ్రరాజ్యంలో మొత్తం కేసుల సంఖ్య 24 లక్షల 25 వేలకు పెరిగింది. ఇప్పటివరకు అమెరికాలో కరోనాతో లక్ష 24 వేల మంది మరణించారు. లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్‌ను కరోనా బెంబేలెత్తిస్తోంది. రోజువారీ కొత్త కేసుల విషయంలో బ్రెజిల్, అమెరికాను దాటే సింది. గత 24 గంటల్లో 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 11 లక్షల 52 వేల మంది కరోనా బాధితులున్నారు. గత 24 గంటల్లో ఒక వెయ్యి 364 మంది మరణించడంతో మృతుల సం ఖ్య 52,771కి చేరింది.

Next Story

RELATED STORIES