తాజా వార్తలు

హెటిరో 'కోవిఫర్' ధర రూ.5,400

హెటిరో కోవిఫర్ ధర రూ.5,400
X

ప్రముఖ ఔషధ తయారీ సంస్థ హెటిరో డ్రగ్స్ కోవిడ్‌–19 చికిత్సకు రెమ్‌డెసివిర్‌ ఔషధం ‘కోవిఫర్‌’ ను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఔషదానికి ఐసీఎంఆర్ కూడా అనుమతిచ్చింది. అయితే హెటిరో సంస్థ ‘కోవిఫర్‌’ ధరను రూ.5,400గా నిర్ణయించింది. ముందుగా 20,000 వయల్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ బుధవారం తెలిపింది. ఇందులో 10,000 వయల్స్‌ హైదరాబాద్, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, ముంబైతోపాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు త్వరలోనే సరఫరా చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. ఇక మరో 10,000 వయల్స్‌ను విజయవాడ, కోల్‌కత, ఇండోర్, పట్నా, భువనేశ్వర్, భోపాల్, లక్నో, రాంచీ, కొచ్చిన్, త్రివేండ్రం, గోవాల్లో వారంరోజుల్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది.

Next Story

RELATED STORIES