కరోనా కాలంలో కలప నోట్లు.. చెలామణిలోకి వచ్చిన కొత్త కరెన్సీ

కరోనా కాలంలో కలప నోట్లు.. చెలామణిలోకి వచ్చిన కొత్త కరెన్సీ

దొంగ నోట్లు తెలుసు కానీ ఈ కలప నోట్లేంటో అని కదా మీ డౌట్. వైరస్ ప్రభావంతో వ్యాపారం లేదు.. చేతిలో చిల్లి గవ్వ లేదు. ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో తమ పట్టణ ప్రజలకు సాయం చేసేందుకు అమెరికాలోని టెనినో పట్టణం ఈ కలప నోట్లను ముద్రిస్తోంది. వాటిని మార్కెట్లో చెలామణి అయ్యేలా చూస్తోంది. టెనినో పట్టణ మేయర్ వేన్ ఫర్నియర్ కి వచ్చిన ఆలోచనే ఈ కలప నోట్ల ముద్రణ. గతంలో కూడా ఒకసారి అమెరికాలో ది గ్రేట్ డిప్రెషన్ వచ్చినప్పుడు ఇలాగే కలప నోట్లను ముద్రించి వినియోగించారట.

ఇప్పుడు మళ్లీ అమల్లోకి తీసుకొచ్చారు. ఒక్కో కలప నోటు ముద్రించడానికి 25 డాలర్లు ఖర్చవుతుంది. 1800 మంది జనాభా ఉన్న టెనినో పట్టణలోని వారికి ఈ నోట్లను ఇస్తున్నారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నవారికి నెలకు 300 కలప డాలర్లను ఇస్తున్నారు. సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు ఎక్కడైనా ఈ కలప నోట్లు తీసుకుంటారు. అయితే వీటికి చిల్లర ఇవ్వరు. 25 డాలర్లకు సరిపడా సరుకులు కొనుక్కోవాల్సిందే. వీటితో సిగరెట్టు, మద్యం కొనుక్కుంటానే కుదరదు.. ఓన్లీ ప్రొవిజన్స్ తీసుకోవాలి అంతే.

వీటిని స్థానిక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి అసలు నోట్లుగా కూడా మార్చుకోవచ్చు. లేదా పాత కరెన్సీ నోట్లను కలెక్ట్ చేసే హాబీ ఉన్న వారైతే ఆ నోటుకి రెండు మూడు రెట్లు ఎక్కువిచ్చి మరీ తీసుకుంటారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాలంటే నగదు ఇచ్చి సాయం చేయొచ్చు. కానీ ఆ డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తారో తెలియదు. అదే ఇలా కలప నోట్ల రూపంలో ఇస్తే ఆ డబ్బేదో మా పట్టణంలోనే ఉంటుంది అని స్థానిక నాయకుడు టేలర్ వైట్ వర్త్ తెలిపారు. మంచి ఆలోచన.

Tags

Read MoreRead Less
Next Story