అమెరికాలో నల్లజాతీయుల నిరసనలు.. ఫెయిర్ అండ్ లవ్లీ పేరు మార్పు

అమెరికాలో నల్లజాతీయుల నిరసనలు.. ఫెయిర్ అండ్ లవ్లీ పేరు మార్పు

హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ తన ఉత్పత్తి అయిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ నేమ్ మారుస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిర్ అండ్ లవ్లీలో ఫెయిర్ అనే పదాన్ని తొలగిస్తున్నట్టు తెలిపింది. అయితే, ఈ కీలక నిర్ణయం వెనుక.. అమెరికాలో జరుగుతున్న నల్లజాతియుల నిరసనలు అని తెలుస్తుంది. ఫెయిర్ అండ్ లవ్లీ నల్లగా ఉన్న వారిని.. తెల్లగా మార్చుతుందనే కోణం లో ప్రకటనలు కనిపిస్తాయి. ఈ ప్రటనల ద్వారా నల్లగా ఉన్న వారిని తక్కువగా చూపిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఫెయిర్ అనే పదాన్ని వాడుకొని తమ వస్తువులను అమ్ముకోవడం సరికాదని ఈ సంస్థ అభిప్రాయపడింది. ‘ఫెయిర్’, ‘వైట్’, ‘లైట్’ పదాలతో ఉత్పత్తులు విక్రయించడం సరికాదని.. ఈ పదాలు అందాన్ని నిర్వచించేలా ఉన్నాయని.. దీంతో ఈ పదాలను తొలగించాలని నిర్ణయించినట్లు యూనిలివర్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ డివిజన్ ప్రెసిడెంట్ సన్నీ జైన్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story