పెళ్లి క్యాన్సిల్.. అర్జెంట్ మీటింగ్ ఉంది.. : ప్రధాని

పెళ్లి క్యాన్సిల్.. అర్జెంట్ మీటింగ్ ఉంది.. : ప్రధాని

ముహూర్తం ముంచుకొస్తే లాక్డౌన్ లో కూడా పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు ఉన్నారు. కానీ దేశ ప్రధానికి మాత్రం పెళ్లి చేసుకుందామంటే సాధ్యం కావట్లేదు. ఇప్పటికే రెండు సార్లు క్యాన్సిల్ అయిందట డెన్మార్క్ ప్రధాని మెట్టె ప్రెడ్రిక్ సన్ పెళ్లి. ఈ విషయాన్ని తనే ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. తనకు కాబోయే భర్తతో దిగిన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఆమె.. నేను తనని పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. కానీ అది ఇప్పట్లో జరిగేటట్లు కనబడట్లేదు.

మూడోసారి ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ అవకూడదని ముహూర్తం జూలై నెలలో ఒక రోజు పెట్టుకుంటే.. సరిగ్గా అదే రోజు బ్రస్సెల్స్ లో జరిగే సమావేశానికి హాజరు కావాల్సి వస్తోంది. దేశ ప్రయోజనాల కోసం నేను నా వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నాను. కానీ త్వరలో మేము పెళ్లి చేసుకుంటాం. నిన్ను పెళ్లాడే రోజు కోసం ఎదురు చూస్తున్నా బో (కాబోయే భర్త పేరు) అంటూ రాసుకొచ్చారు. కాగా.. జూలై 17, 18 తేదీల్లో బ్రస్సెల్స్ లో యూరోపియన్ కౌన్సిల్ సమావేశం ఉంది. ఈ సమావేశంలో దాదాపు 27 దేశాల ప్రధానులు పాల్గొని కొవిడ్-19 నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story