మైనర్ బాలికపై పోలీసుల అఘాయిత్యం.. ఆమె గర్భం దాల్చటంతో..

మైనర్ బాలికపై పోలీసుల అఘాయిత్యం.. ఆమె గర్భం దాల్చటంతో..
X

ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై రెండునెలలుగా పోలీసు ఇన్‌స్పెక్టరు అఘాయిత్యం చేశాడు. పలుమార్లు బాలికపై అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. దీంతో బాలికకు అబార్షన్ చేయించేందుకు పోలీసు అధికారి యత్నించాడు. ఒడిశా రాష్ట్రంలోని సుందర్ ఘడ్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.

బిరమిత్రాపూర్‌లో మార్చి 25న జరిగే ఉత్సవం కోసం ఓ మైనర్ బాలిక పట్టణానికి వచ్చింది. అయితే లాక్ డౌన్ కారణంగా ఆ ఉత్సవం రద్దు అయింది. దీంతో సదరు బాలిక బస్ స్టాండులో ఒంటరిగా కూర్చుంది. రాత్రివేళ బస్ స్టాండులో బాలికను చూసిన పోలీసు పెట్రోలింగ్ టీమ్ ఆ బాలికను బిరమిత్రాపూర్ పోలీసుస్టేషనుకు తీసుకువెళ్లారు. ఆ బాలికపై కన్నెసిన ఓ ఇన్‌స్పెక్టర్ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసుస్టేషనులోనే ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలికను ఆమె ఇంటికి పంపించాడు.

ఇంతటితో ఆగని ఆ కీచక పోలీసు.. విచారణ పేరిట తరచూ బాలికను పోలీసుస్టేషనుకు పిలిపించేవాడు. పలుమార్లు ఆమెపై ఇన్‌స్పెక్టరుతో పాటు ఇతర పోలీసులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. రెండు నెలల పాటు బాలికపై అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. దీంతో బాలికకు అబార్షన్ చేయించేందుకు పోలీసు అధికారి యత్నించాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న సుందర్ ఘడ్ జిల్లా శిశుసంరక్షణ అధికారి జెనా ఫిర్యాదు చేశారు. దీంతో కీచక ఇన్‌స్పెక్టర్‌ని సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story

RELATED STORIES