పాక్ లో దారుణం.. ప్రతి ముగ్గురిలో ఒకరు ఫేక్ సర్టిఫికెట్లతో పైలెట్ గా విధులు..

పాక్ లో దారుణం.. ప్రతి ముగ్గురిలో ఒకరు ఫేక్ సర్టిఫికెట్లతో పైలెట్ గా విధులు..

ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం సంపాదించే వాళ్లను చూశాం. అదృష్టం బావుండి అక్కడ తనేంటో ఫ్రూవ్ చేసుకుంటే ఉద్యోగం నిలుస్తుంది. కానీ ఒక పైలెట్ ఫేక్ సర్టిఫికెట్లతో డ్యూటీలో జాయినయ్యాడన్న విషయం తెలిస్తే ప్రయాణీకుల గుండె ఆగిపోతుంది. ఎక్స్ పీరియన్స్ ఉన్నవాళ్లకే గాల్లో ఎగిరే విమాన పైలెట్ ఉద్యోగం అంటే కొంత భయం ఉంటుంది. అలాంటిది ఫేక్ సర్టిఫికెట్లతో.. అదీ పైలెట్ ఉద్యోగం సంపాదించాలంటే ఎంత ధైర్యం ఉండాలి. ఉంటే ఉంటాం పోతే పోతాం అన్న ధీమా ఉంటుందేమో వారిలో. పాక్ పౌర విమానయాన శాఖ మంత్రి స్వయంగా వెల్లడించిన వాస్తవం ఇది.

దేశంలోని 30 శాతం పై చిలుకు పైలెట్లు విమానం నడిపేందుకు అనర్హులు. అభ్యర్థులెవరూ పైలెట్లకు నిర్వహించే పరీక్షకు హాజరు కాకుండా వారి తరపున మరొకరిని డబ్బులిచ్చి పంపిస్తారు. నియమించిన పైలెట్లకు విమానం నడపడంలో సరిపడినంత అనుభవం ఉండదు అని మంత్రి నిండు సభలో ప్రకటించారు. పాక్ సంస్థల్లో ప్రస్తుతం 860 మంది పైలెట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన ప్రభుత్వం నకిలీ లైసెన్సు గల పైలెట్లందరినీ సస్పెండ్ చేసింది. అయితే ఇటీవల విమాన ప్రమాదానికి కారణమైన పైలెట్ల వద్ద ఎలాంటి లైసెన్స్ ఉందనేది స్పష్టత లేదు.

Tags

Read MoreRead Less
Next Story