బిగ్ బాస్-4 లో సమంత!!

బిగ్ బాస్-4 లో సమంత!!
X

ఓ పది మంది సంబంధం లేని వ్యక్తులు 100 రోజులు కలిసి ఉండే ఒకే ఒక వేదిక బిగ్ బాస్. ముచ్చటగా మూడు సీజన్లు ముగించుకుని నాల్గవ సీజన్ లోకి అడుగు పెట్టబోతున్న శుభతరుణంలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. లాక్డౌన్ తో ఇప్పటికే మొదలు కావలసిన బిగ్ బాస్ 4.. త్వరలో బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, నానీ వారి వాక్చాతుర్యంతో ప్రేక్షకులను అలరించారు. మరి సీజన్ 4కి ఎవరు హోస్ట్ చేస్తారు అన్న ప్రేక్షకుల ఆలోచనలకు తెరదించుతూ సమంత పేరు తెరపైకి వచ్చింది. అందం, అభినయం, మంచితనం మేళవించిన సమంత వస్తే ఇంక చెప్పేదేముంది. హౌస్ లో ఉన్న వారికి ఆనందం.. ప్రేక్షకులకి పరమానందం. సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న సమంత హోస్ట్ గా ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Next Story

RELATED STORIES