తాజా వార్తలు

తెలంగాణలో ఒక్కరోజే 985 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణలో ఒక్కరోజే 985 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
X

తెలంగాణలో కరోనా స్వైర విహారం చేస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 985 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా Ghmc పరిధిలోనే 774 కేసులు నమోదయ్యాయి.

రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్‌ 53, వరంగల్‌ అర్బన్‌ 20, మెదక్‌ 9, ఆదిలాబాద్‌లో 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్‌, నిజామాబాద్‌, రాజన్నసిరిసిల్లలో 6 కేసులు నమోదయ్యాయి. ఇక, సిద్దిపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మంలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ములుగు, జగిత్యాల, యాదాద్రిభువనగిరిలో 2 కేసులు ఉన్నాయి. వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో ఒకరికి కరోనా సోకింది.

ఈ కరోనా మహమ్మారి బారిన పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 75,308 పరీక్షలు చేయగా, 12,349 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా 237 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది.

Next Story

RELATED STORIES