సంపాదనలోనే సంతోషం ఉందని ఇన్ని రోజులు.. : రాశీ ఖన్నా

ఇన్ని రోజులు సంపాదన వెనకే పరుగులు తీశాం. అందులోనే ఆనందం ఉందనుకున్నాం. ప్రస్తుత పరిస్థితులు చూశాకైనా తమ ఆలోచనా విధాన్ని మార్చుకోవాలని, సరికొత్త జీవన సరళిని అలవర్చుకోవాలని హీరోయిన్ రాశీ ఖన్నా అంటోంది. ఇన్నాళ్లు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి పరుగులు పెట్టాం. సంపాదనలోనే సంతోషం ఉందని భ్రమ పడ్డాం. స్వార్థంతో ప్రకృతి ప్రసాదించిన సహజవనరుల్ని ధ్వసం చేసుకున్నాం. మన ఉనికిని మనమే ప్రశ్నార్థకం చేసుకున్నాం. కరోనా మనల్ని హెచ్చరించడానికే వచ్చిందేమో. కనీసం ఇప్పుడైనా మారడానికి ప్రయత్నిద్దాం. మంచి జీవన సరళిని అలవర్చుకుందాం. అసలైన ఆనందం ఐశ్వర్యం ఎక్కడుందో గుర్తిద్దాం. మానసిక ప్రశాంతతను అలవర్చుకుందాం. ఆరోగ్యమే అన్నిటికంటే మించిన సంపద అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రేమాభిమానాల్ని నలుగురికీ పంచడంలోనే అసలైన ఆనందం ఉంది అని రాశీ పేర్కొంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com