త‌న‌కిష్ట‌మైన చికెన్ బిర్యానీ తీసుకురాలేదని భార్య ఆత్మహత్య

త‌న‌కిష్ట‌మైన చికెన్ బిర్యానీ తీసుకురాలేదని భార్య ఆత్మహత్య
X

చికెన్ బిర్యానీ ఓ మహిళ ప్రాణాలు తీసింది. త‌న‌కిష్ట‌మైన చికెన్ బిర్యానీ.. మహిళ ఆత్మహత్య చేసుకోడానికి దారితీసింది. భ‌ర్త చికెన్ బిర్యానీ తీసుకురాలేద‌ని భార్య‌ నిప్పంటించుకున్న ఘటన త‌మిళ‌నాడులో చోటుచేసుకుంది.

మ‌ల‌ప్పురం స‌మీపంలోని పుంజేరి గ్రామానికి చెందిన 32 ఏళ్ల మ‌నోహ‌ర‌న్‌, 28 ఏళ్ల సౌమియాకు ప‌న్నేండ్ల క్రితం పెళైంది. వీరికి 11 ఏళ్ల కూతురు, 10 ఏళ్ల బాబు ఉన్నారు. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో ఓ చికెన్ బిర్యానీ ఒకరి ప్రాణాలు తీసింది.

గత బుధ‌వారం వాళ్ల ఇంటి స‌మీపంలో ఓ బిర్యానీ సెంట‌ర్ ను నూత‌నంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక‌టి కొంటే మ‌రొ బిర్యానీ ఫ్రీ అని ఆఫ‌ర్ ప్రకటించారు. దీంతో చికెన్ బిర్యానీ తినాలని ఉంది.. తీసుకునిరమ్మని భర్తతో చెప్పింది భార్య. అయితే భార్య మాటను విని చికెన్ బిర్యానీ కోసం వెళ్లాడు భర్త. అయితే ఆఫర్ ఉండటంతో చికెన్ బిర్యానీ తొంద‌ర‌గా అమ్ముడు పోయింది. దీంతో భర్త బిర్యానీ సెంట‌ర్ కు వెళ్లేస‌రికి చికెన్ బిర్యానీ లేదు. అయితే అత‌ను ప్లేన్ బిర్యానీ ఇంటికి తీసుకొచ్చాడు. చికెన్ బిర్యానీ తీసుకురమ్మంటే.. ప్లేన్ బిర్యానీ తీసుకువస్తావా.. నాకు ఏం వద్దు అని భర్తతో గొడవ పెట్టుకుంది. భర్త బ్రతిమిలాడిన త‌న‌కు చికెన్ బిర్యానే కావాల‌ని భార్య మొండిప‌ట్టు ప‌ట్టింది. ప్లేన్ బిర్యానీని తిన‌ను అని తెగేసి చెప్పింది.

భార్యపై ఆగ్రహించిన భర్త ఆ బిర్యానీ ప్యాకెట్ ను పొరుగింటి వారికి ఇచ్చి త‌న ప‌నికి వెళ్లాడు. దీంతో భార్య భవ‌నం పైకెక్కి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. మంట‌ల్లో కాలిపోతున్న ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె శుక్ర‌వారం క‌న్నుమూసింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని, ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story

RELATED STORIES