ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి: బండ్ల గణేష్

ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి: బండ్ల గణేష్
X

మహమ్మారి కరోనా మనుషుల్ని మార్చేస్తోంది. తాను ఇది వరకు చేసిన తప్పులేమైనా ఉన్నా, ఎవరినైనా బాధ పెట్టినా పెద్ధ మనసుతో క్షమించమని కోరుతున్నారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్న విషయం తెలిసిందే. ఫైర్ అవడం.. వెంటనే క్షమాపణ కోరడం బండ్ల గణేష్ నైజం. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా న్యూస్ పేపర్ లో వచ్చిన ఒక వార్త.. ''ఆన్ లైన్ లో ద్వేషాన్ని ఆపండి అనే టైటిల్ తో వచ్చిన రతన్ టాటా వ్యాఖ్యల్ని బండ్ల గణేష్ షేర్ చేశారు. అందులో " ఈ ఏడాది అందరూ సమస్యల్లో మునిగి ఉన్నారు. కొందరు ఆన్ లైన్ లో ఒకరి మనోభావాలను మరొకరు దెబ్బతీస్తున్నారు. అందరూ కలిసి అభివృద్ధి సాధించాల్సిన ఈ క్లిష్ట సమయంలో విద్వేషాన్ని పెంచే వ్యాఖ్యలు చేయడం సరికాదు.. సహనాన్ని పెంచుకుంటూ, ఇతరుల పట్ల దయతో, అర్థం చేసుకునే మనస్తత్వాన్ని అలవర్చుకుంటూ మరింత ముందుకెళదాం' అని పారిశ్రామిక వేత్త రతన్ టాటా చేసిన వ్యాఖ్యలతో తనకు జ్ఞానోదయం అయిందని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

Next Story

RELATED STORIES