ఆర్జీవీ నెక్ట్స్ మూవీ 'ప‌వ‌ర్ స్టార్'..

ఆర్జీవీ నెక్ట్స్ మూవీ ప‌వ‌ర్ స్టార్..
X

కరోనా లాక్‌డౌన్ కారణంగా గత మూడు నెలలుగా థియేటర్స్‌ లో ఒక్క మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు. మూవీ షూటింగ్‌లు కూడా ఆగిపోయాయి. అయితే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ త‌న ఆర్జీవి వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో క్లైమాక్స్‌, న‌గ్నం వంటి మూవీలను రిలీజ్ చేశారు. క్లైమాక్స్‌కి టిక్కెట్ ధ‌ర రూ. 100 ఫిక్స్ చేశారు. ఇక న‌గ్నంకి రూ.200 వ‌సూలు చేశాడు. ఇక ఆర్జీవి వర‌ల్డ్ థియేట‌ర్‌లో రిలీజ్ అవుతున్న త‌న నెక్ట్స్ మూవీని ప్ర‌క‌టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు వ‌ర్మ‌.

'ఆర్జీవి వర‌ల్డ్ థియేట‌ర్‌లో రిలీజ్ కానున్న నెక్ట్స్ మూవీ టైటిల్ ప‌వ‌ర్ స్టార్. పీకే, ఎంఎస్‌, ఎన్బీ, టీఎస్‌, ర‌ష్య‌న్ లేడీ, న‌లుగురు పిల్ల‌లు, 8 గేదెలు, ఆర్జీవి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్నారు. పాత్ర‌లు అర్ధం చేసుకున్న వారికి ఎలాంటి బ‌హుమ‌తులు ఇవ్వ‌బ‌డ‌వు' అని వ‌ర్మ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక 'ప‌వ‌ర్ స్టార్‌' లో ఓ పాత్ర‌కి సంబంధించిన వ్య‌క్తిని ప‌రిచ‌యం చేశారు. ' అతను నా కార్యాలయాన్ని సందర్శించినప్పుడు ఈ షాట్ తీయబడింది. ఇత‌ర వ్యక్తితో పోలిక ఉంటే అది యాదృచ్చికంగా.. ఉద్దేశపూర్వకంగా అనుకోకుండా ఉండి ఉండొచ్చు ' అని వ‌ర్మ ట్వీట్ చేయడం విశేషం.

Next Story

RELATED STORIES