ఫేస్‌బుక్‌కు భారీ షాక్.. 52 వేల కోట్లు ఆవిరి

ఫేస్‌బుక్‌కు భారీ షాక్.. 52 వేల కోట్లు ఆవిరి

ఫేస్ బుక్ సంస్థకు భారీ షాక్ తగిలింది. ఒక్క దెబ్బతో ఒక్కరోజులోనే 52వేల కోట్ల రూపాయల సంపద కోల్పోయింది. విద్వేష పూరిత ప్రచారాలకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లు వేదికలుగా నిలుస్తున్నాయని.. దీంతో.. అనేక బహుళజాతి కంపెనీలు వాటి ప్రకటనలు ఫేస్‌బుక్‌ కి ఇవ్వటం నిలిపివేశాయి. దీంతో స్టాక్ మార్కెట్ లో షేర్ విలువ భారీగా పడిపోయింది. ఒక్కరోజులోనే 52 వేలకోట్ల విలువైన సంపద కోల్పోయి. బ్లూమ్ బర్గ్ బిలినియర్ జాబితాలో జూకర్ బర్గ్ నాల్గవ స్థానానికి పడిపోయారు. కొకోకోలా, యూనీలివర్ వంటి సంస్థలు వాటి ప్రకటనలు నిలిపివేశాయి.

జాతి, లింగ వివక్షతకు సంబందించిన పోస్టులు కట్టడి చేయడంలో ఫేస్‌బుక్ విఫలమైందని విమర్శలు ఎదుర్కోంటుంది. అమెరికాలో ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణం తరువాత ఈ విమర్శలు మరింత పెరిగాయి. సంస్థలో కొందరు ఉద్యోగులు కూడా రాజీనామాలు చేశారు.

అయితే, ఈ విమర్శలపై సంస్థ సీఈఓ జూకర్ బర్గ్ మాట్లాడుతూ.. విద్వేశపూరిత పోస్టింగులకు నిర్వచనం మార్చుతున్నట్టు తెలిపారు. ఇతర వర్గాల వారిని ప్రమాదకరంగా చూపించే అడర్వటైజ్‌మెంట్‌లకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story