పరుగులు పెడుతున్న పసిడి ధర

బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పెరిగింది. ఇక ఢిల్లీ, విజయవాడలో కూడా బంగారం ధరలో స్వల్ప మార్పులు జరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం 40 రూపాయలు పెరిగి రూ. 47,250కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 40 పెరిగి రూ.48,450గా ఉంది.
ఇక హైదారాబాద్‌లో బంగారం ధర 22 క్యారెట్లు రూ.40 పెరిగి రూ. 46,450కు చేరింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.40 పెరిగి రూ.50 వేల మార్కును దాటి రూ.50,660 వద్ద నిలిచింది. ఇది బంగారానికి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. ఇక విజయవాడలో బంగారం ధరలు .. హైదరాబాద్‌లో ఉన్న విధంగానే ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక వెండి ధర కూడా పరుగులు పెడుతుంది. వెండి ధర కేజీకి రూ.39౦ పెరిగి కేజీ వెండి రూ.48,500 నమోదు అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com