పాక్ మాజీ అధ్యక్షుడికి అరెస్ట్ వారెంట్

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జార్ధారీకి యాంటీ కరప్షన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2008 నాటి లగ్జరీ వెహికల్స్ కేసులు ఆయన విచారణకు హాజరుకాలేదని బెయిల్ బుల్ వారెంట్ ఇస్యూ చేశారు. లగ్జరీ కార్లును మాజీ ప్రధానులు నవాజ్ షరీఫ్, యూసఫ్ రజ గిలానీలు అసలు ధరల్లో 15శాతం మాత్రమే చెల్లించి.. మిగతా డబ్బుకు ప్రభుత్వ ఖజానాకు నష్టం చేశారని ఆరోపనలు ఎదుర్కోంటున్నారు. అయితే, అసిఫ్ అలీ జర్ధారీ తరుపు న్యాయవాది తన క్లయింట్ వయోవృద్దుడని.. ఆయన కోర్టుకు హారజరైతే కరోనా సోకే ప్రమాదం ఉందని... ఆయనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. కానీ, కోర్టు నిరాకరించింది. కనీసం కరోనా పరిస్థితి మెరుగుపడినంత వరకూ అయినా మినహాయింపు ఇవ్వాలని కోరినా.. కోర్టు తిరస్కరించింది.
జర్దారీకి బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేస్తున్నట్లు అకౌంటబిలిటీ కోర్టు జడ్జి అస్ఘర్ అలీ ప్రకటించారు. తదుపరి విచారణ ఆగస్టు 17న జరుగుతుందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com