భారత్ బాటలో అమెరికా.. టిక్‌టాక్‌ ని..

భారత్ బాటలో అమెరికా.. టిక్‌టాక్‌ ని..

చైనా యాప్ టిక్‌టాక్‌ ప్రపంచంలో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. ఆదాయాన్ని కూడా ఆర్జించి పెడుతున్న టిక్‌టాక్‌ ని బ్యాన్ చేస్తున్నారంటే ఆవేదన పడిన హృదయాలెన్నో. అయినా గట్టి మనసు చేసుకుని అంగీకరించక తప్పలేదు. దేశ భద్రత కంటే మనకేదీ ముఖ్యం కాదని ముక్త కంఠంతో నినదించిన భారతీయులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. భారత్ బాటలో అమెరికా కూడా పయనించాలనుకుంటోంది. అక్కడ కూడా టిక్‌టాక్‌ బ్యాన్ చేయాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. భారత్ కు మద్ధతుగా రిపబ్లికన్ సెనెటర్ జాన్ కోర్నిన్ ట్వీట్ చేశారు.

ఇప్పటికే అమెరికా టిక్‌టాక్‌ ను బ్యాన్ చేసి ఉండాల్సిందని మరో రిపబ్లికన్ ప్రజాప్రతినిధి రిక్ క్రాఫోర్డ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మాట్లాడుతూ దేశంలో 4 కోట్ల మంది టిక్‌టాక్‌ వాడుతున్నారని, వారిలో ఎవరైనా చైనా కమ్యూనిస్ట్ పార్టీని తిడుతూ వీడియోలు పెడితే ఆటోమేటిగ్గా టిక్‌టాక్‌ యాప్ డిలీట్ చేస్తుందని తెలిపారు. అమెరికాలో ఇప్పటికే టిక్‌టాక్‌ ని నిషేధించాలంటూ రూపొందించిన రెండు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.

ఐవోఎస్ 14 ఇన్‌స్టాల్‌ చేసిన యాపిల్ ఫోన్ లలో వ్యక్తిగత సమాచారాన్ని టిక్‌టాక్‌ దొంగిలిస్తున్నట్లు కంపెనీ ఇటీవల వెల్లడించింది. ఈ అంశాన్ని టిక్‌టాక్‌ యాజమాన్యం ముందు ఉంచగా ఆ లొసుగును సరిదిద్దుతామని హామీ ఇచ్చింది. టిక్‌టాక్‌ చైనాలో రిజిస్టర్ అయిన కంపెనీ అని, అది అక్కడి ప్రభుత్వం చెప్పినట్లు వినాల్సి ఉంటుందని, ఏ సమాచారాన్ని అడిగినా షేర్ చేయాల్సి ఉంటుందని అమెరికా న్యాయశాఖ స్థాయీ సంఘం చైర్మన్ అయిన సెనెటర్ హాలే తన అభిప్రాయాన్ని వెల్డడించారు.

Tags

Read MoreRead Less
Next Story