లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ఆరోగ్య మంత్రి రాజీనామా

న్యూజిలాండ్ ఆరోగ్యశాఖ మంత్రి డేవిడ్ క్లార్క్ తన పదవికి రాజీనామా చేశారు. లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించి ప్రజాగ్రహానికి గురైన ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు దేశ రాజధాని వెల్లింగ్టన్‌లోని పార్లమెంట్‌లో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
న్యూజిలాండ్ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ ప్రాణాంతకర వైరస్‌ని కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి, అమలు చేస్తోంది. అయితే లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ డేవిడ్ క్లార్క్ తన కుటుంబసభ్యులతో కలిసి బీచ్ ట్రిప్‌కి వెళ్లారు. దీంతో పాటు మౌంటెన్ బైకింగ్ ట్రాక్‌లో డ్రైవింగ్ కూడా చేశారు.
అయితే ఆరోగ్యశాఖ మంత్రి లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కరోనా వైరస్‌ను అరికట్టడంలో తన పాత్రను విస్మరించినందుకు ప్రధాని ఆదేశాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యాశాఖ మంత్రి క్రిస్ హిప్కిన్స్‌కు ప్రధాని జసిందా ఆర్డెర్న్ తాత్కాలిక ఆరోగ్యశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలను అప్పగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com