భారత్ నిర్ణయం ప్రశంసనీయం: నిక్కీహేలీ

భారత్ నిర్ణయం ప్రశంసనీయం: నిక్కీహేలీ

చైనా దుందుడుకు వ్యవహార శైలిని కట్టడి చేసేందుకు భారత్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం అని ఇండో-అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీహేలీ ప్రశంసించారు. 59 చైనా యాప్ లను నిషేధం విధించడం ఆనందంగా ఉందన్నారు. చైనా యాప్ ల వాడకం వల్ల భారత దేశ వ్యక్తిగత సమాచారం విదేశీ సర్వర్లలో నిక్షిప్తం అవుతోందని, భారత సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ తదితర అంశాలకు ఇది అత్యంత హానికరమని భావించి నిఫేధించారు. ఈ మేరకు నిక్కీ బుధవారం ట్విట్టర్ వేదికగా.. టిక్ టాక్ భారత్ లో అతి పెద్ద మార్కెట్ ని సొంతం చేసుకుంది. ఆ యాప్ నిషేధం చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కాగా, ఇదే విషయమై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో కూడా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా చేయడం ద్వారా భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత పెరగడంతో పాటు, జాతి భద్రతకు ఉపయోగకరమని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story