అంతర్జాతీయం

చైనాలో భారీ వ‌ర్షాలు.. 14 మంది మృతి

చైనాలో భారీ వ‌ర్షాలు.. 14 మంది మృతి
X

చైనాలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. సిచువాన్ ప్రావిన్స్‌లో భారీగా కురిసిన వర్షాల వ‌ల్ల వ‌ర‌ద‌లు పోటెత్తాయి. ఈ వ‌ర‌ద‌లవ‌ల్ల‌ 14 మంది మృతి చెందారు. మరో ఎనిమిది మంది గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. దీంతో బాధితుల కోసం ప్ర‌త్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం 5,660 మందికి ఇహాయీ టౌన్‌షిప్, గయోంగ్ సబ్‌ డిస్ట్రిక్ట్‌ల‌లో తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. కుండపోత వర్షాల కారణంగా ప్రావిన్స్‌లో 104 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.

Next Story

RELATED STORIES