ఫుట్ ‌బాల్ మ్యాచ్ చూడటానికి వచ్చిన బిన్‌లాడెన్

ఫుట్ ‌బాల్ మ్యాచ్ చూడటానికి వచ్చిన బిన్‌లాడెన్

ఇంగ్లాండ్ ఫుట్ బాల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ చూడడానికి అల్ ఖైదా వ్యవస్థాపకుడు వచ్చాడు. సుమారు చనిపోయి దశాబ్దం అయిపోయిన తరువాత ఆయన ఎలా వచ్చాడు అని అనుకుంటున్నారా? నిజంగా ఆయన రాలేదు. ఆస్టేడియంలో ఆయన కటౌట్ కనిపించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో క్రీడా పోటీలకు ప్రేక్షకులను ఆహ్వానించకూడదని ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే, ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ లు నిర్వహిస్తే.. బాగుండదని.. బొమ్మలు, మనుషుల ఫోటోలు గ్యాలరీలో పెట్టాలని నిర్వహించారు. క్రీడలు చూడడానికి ఇంట్రస్ట్ ఉన్నవారు వారి ఫోటోలు పంపిచాలని స్టేడియం యాజమాన్యం తెలిపింది. దీంతో చాలా మంది వారి ఫోటోలు పంపించారు. ఇలా ఒక వ్యక్తి ఒసామా బిన్ లాడెన్ కటౌట్ పంపించారు. దీనిని గమనించని స్టేడియం యాజమాన్యం ఆ కటౌట్ ను అలాగే పెట్టెశారు. తరువాత అలెర్ట్ అయిన యాజమాన్యం దానిని తొలగించి.. మరోసారి ఇలాంటి పొరపాటు జరుగకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story