హాంకాంగ్ విషయంలో బ్రిటన్ జోక్యం తగదు: చైనా

హాంకాంగ్ విషయంలో బ్రిటన్ జోక్యం కావద్దని చైనా తెలిపింది. హాంకాంగ్ వాసులకు తమ పౌరసత్వం ఇస్తామని బ్రిటన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి చైనా ఘాటుగా స్పందించింది. బ్రిటన్ వైఖరిని తాము ఖండిస్తున్నామని.. బ్రిటన్ అలాంటి నిర్ణయాలు తీసుకుంటే.. తమ చర్యలు వారికి ధీటుగా ఉంటాయని హెచ్చరించింది. 1997 వరకూ హాంకాంగ్ బ్రిటన్ కు వలస రాజ్యంగా ఉండేది. అయితే, తరువాత కొన్ని నిబంధనలతో హాంకాంగ్.. చైనాలో విలీనమైంది. 50 ఏళ్ల వరకూ హాంకాంగ్ కు న్యాయ, శాసన స్వయంప్రతిపత్తి కల్పించాలనేది ముఖ్యమైన నిబంధన. అప్పట్లో చైనా కూడా దానికి అంగీకరించింది. కానీ, చైనా అప్పటి ఒప్పందాలను ఉల్లంగిస్తూ.. హాంకాంగ్ భద్రతా చట్టాన్ని మంగళవారం నుంచి అమలులోకి తెచ్చింది. దీనిపై బ్రిటన్ స్పందిస్తూ.. హాంకాంగ్ ప్రజలకు తమ పౌరసత్వం ఇస్తామని ప్రకటించింది. బ్రిటన్ ప్రకటనను లండన్ లోని చైనా ఎంబసీ ఖండించింది. హాంకాంగ్ లోని వారంగా చైనా జాతీయులేనని చెప్పింది. బ్రిటన్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే.. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్టేనని డ్రాగన్ హెచ్చరించింది. హంకాంగ్ విషయాల్లో బ్రిటన్ జోక్యం చేసుకోవద్దని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com