నిహారిక పెళ్లిపై నాగబాబు స్పందన..

నిహారిక పెళ్లిపై నాగబాబు స్పందన..
X

మెగా తనయ నిహారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. తన కుమార్తె పెళ్లి గురించి నాగబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్య, నిహారికల పెళ్లి చేయడానికి ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఇది తమ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. నిశ్చితార్థం, పెళ్లి ఇలా ఏ వేడుక చేసినా ప్రభుత్వ నిబంధనలు పాటించి చేస్తామని ఆయన తెలిపారు. ఏదో హడావిడిగా పూర్తి చేయాలనుకోవడం లేదని ఆయన అన్నారు. అయితే వివిధ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం నిహారిక, చైతన్యల నిశ్చితార్థం ఆగస్ట్ 13న జరిగే అవకాశం ఉంది. పెళ్లి ఎప్పుడు అనేది ఇంకా స్పష్టత రాలేదు.

Next Story

RELATED STORIES