ఏడేళ్ల బాలికపై అఘాయిత్యం.. పూల వ్యాపారి అరెస్టు

ఏడేళ్ల బాలికపై అఘాయిత్యం.. పూల వ్యాపారి అరెస్టు
X

చెన్నై‌లో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై అఘాయిత్యం చేసి హత్య చేసిన ఘటన పుదుకోట జిల్లాలో చోటుచేసుకుంది. తమ కూతురు మంగళవారం నుంచి కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బుధవారం సాయంత్రం గాయాలతో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పుదుకోట ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు.

సంఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ అరుణ్ శక్తికుమార్ పరిశీలించి, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. అరన్‌తాంగి డీఎస్పీ బాలమురగన్ నేతృత్వంలో ఓ టీమ్‌ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక పోలీస్ బృందం.. బాలిక పక్క ఇంట్లో ఉంటున్న 27 ఏళ్ల పూల వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారించారు.

కాగా, పోస్టుమార్టంలో బాలిక హత్యాచారానికి గురైందని నిర్ధారించారు. ఈ వ్యవహారంలో బాలికపై అఘాయిత్యం చేసి హత్య చేసినట్లు రాజేష్ అంగీకరించాడు. దీంతో ఈ ఘటనలో పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ ఘటనపై సీఎం ఎడప్పాడి పళనిస్వామి స్పందించారు. బాలికపై అఘాయిత్యం చేసి హత్య చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు చేపడతామని సీఎం తెలిపారు.

Next Story

RELATED STORIES