Top

పాకిస్థాన్‌లో రైలు ప్రమాదం.. 15 మంది మృతి

పాకిస్థాన్‌లో రైలు ప్రమాదం.. 15 మంది మృతి
X

ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ప్రతీరోజూ వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుంటే.. మరోవైపు, పలు ఘటనల వలన జరుగుతున్న మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫరూఖాబాద్‌లో రైలు వ్యాన్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15మంది చనిపోయారు. లాహోర్ నుంచి కరాచీకు వెళ్తున్న షా హుస్సేన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫరూఖాబాద్ రైల్వేక్రాసింగ్ వద్ద వ్యాన్ ను ఢీకొట్టింది. ఈ వ్యాన్ లో ఉన్న వారు సన్‌కానా సాహిబ్ నుంచి వస్తున్న యాత్రికులని అధికారులు చెబుతున్నారు. యాత్రికుల్లో 15 మంది మృతి చెందారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీం సంఘటనా స్థలాన్ని చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

Next Story

RELATED STORIES