కరోనాతో కన్నుమూసిన ఆఫ్ఘన్ అధ్యక్ష ప్రత్యేక రాయబారి

కరోనాతో కన్నుమూసిన ఆఫ్ఘన్ అధ్యక్ష ప్రత్యేక రాయబారి

ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడి ప్రత్యేక రాయబారి యూసుఫ్ గజన్ఫార్ కొవిడ్ 19తో కన్నుమూశారు. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి గజన్సార్ ఆర్ధికాభివృద్ధి, పేదరిక నిర్మూలనపై ప్రత్యేక రాయబారిగా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి కోవిడ్ సోకింది. టర్కీలో చికిత్స తీసుకున్నా పరిస్థితి విషమించడంతో మరణించారని అధ్యక్షుడి సలహాదారు షాజైన్ ముర్తాజావి పేర్కొన్నారు. కాగా, కాబూల్ లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో ఏప్రిల్ లో భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సుమారు 40 మంది కొవిడ్ బారిన పడ్డారు. దేశంలో ఇప్పటి వరకు 32,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 819 మంది మృత్యువాత పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story