మందు తాగే ముందు 'ఛీర్స్' కొట్టేది ఎందుకో తెలుసా..!!

మందు తాగే ముందు ఛీర్స్ కొట్టేది ఎందుకో తెలుసా..!!

'మందు బాబులం మేము మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం' .. ఓ సినీ గేయ రచయిత చెప్పినట్టు మందు కొట్టిన చాలామంది మహారాజులా ఫీల్ అవుతుంటారు. కొంత మంది సంతోషంలో మందు తాగుతారు. మరికొంత మంది బాధ కలిగితే మందు కొడతారు. లవ్‌లో పడ్డా తాగడమే.. లవర్ బ్రేకప్ చెప్పినా తాగడమే.. పెళ్ళిళ్లు అయినా.. చావు కబురైనా.. కారణం వెతుక్కుని మరీ పెగ్గు మీద పెగ్గు వేసే మందు బాబులు చాలామందే ఉన్నారు. అసలు ఏ కారణం లేకుండా తాగే బ్యాచ్ కూడా ఉంటుంది.

అయితే మందు తాగేముందు.. మందుబాబులు ఒకటి తప్పక పాటిస్తారు. అదే 'ఛీర్స్' చెప్పడం. మందు తాగేముందు ' ఛీర్స్' అని చెప్పి.. లటుక్కున నోట్లో పోసుకుంటారు. మరి మందు కొట్టే ముందు 'ఛీర్స్' ఎందుకో చెబుతారో తెలుసా? అందుకు చాలా కారణాలు ఉన్నాయి.

మందు తాగే ముందు ఛీర్స్ చెప్పుకోవటం మధ్యయుగం కాలం నుంచి వస్తున్న సంప్రదాయం అని కొందరు చెబుతుంటారు. మధ్యయుగం కాలంలో సముద్రపు దొంగలు ఈ సంప్రదాయా న్ని మొదలై పెట్టారట. వీరు పెద్ద పెద్ద ఓడల్లో సరుకు లేదా, నగదును దోచుకునేవాళ్లు. ఆ సొమ్మును పంచుకొని .. ఆ తర్వాత మందు పార్టీ చేసుకునేవాళ్ళు. అయితే ఆ సమయంలో వారు సేవించే మద్యంలో విషం కలుపుతారనే అనుమానంతో.. ఒకరి పై మరొకరికి నమ్మకం కలగడానికి గ్లాసుల్లో పోసుకున్న మందు గ్లాసులను ఒకచోట చిందించేవారట. అలా చిందిన మందు అందరూ తాగేవాళ్ళు. ఇదే 'ఛీర్స్' సంప్రదాయంగా మారింది.

ఛీర్స్ గురించి మరికొంత మంది ఏం చెబుతున్నారంటే.. మద్యం తాగేవాళ్లంతా తమ గ్లాసుల్లో సమానంగా ఉన్నదా లేదా.. మరొకరికి ఎక్కువ గానీ , తక్కువగానీ వచ్చిందా అనే విషయాన్ని స్పష్టం చేయడానికే అందరూ ఒకసారి చూపించుకుని తాగడం అలవాటు చేసుకున్నారట.

మరికొంత మంది ఛీర్స్ గురించి ఏం చెబుతున్నారంటే.. పంచేద్రియాలైన క‌ళ్లు, ముక్కు, నాలుక‌, చ‌ర్మం, చెవులలో మొద‌టి నాలుగింటి ద్వారా మ‌ద్యం సేవించ‌డాన్నిఆస్వాదిస్తాం. కానీ చెవుల‌కు మాత్రం ఎలాంటి అనుభూతి క‌ల‌గ‌దు. ఈ క్ర‌మంలో చెవులు కూడా మ‌ద్యం అనుభూతిని అందించడానికి విన‌ప‌డే విధంగా గ్లాసులు కొడుతూ 'ఛీర్స్' చెబుతారట‌. ఇక గ్లాసుల‌తో ఛీర్స్ కొడితే ఆ శబ్దానికి దుష్ట శ‌క్తులు పారిపోతాయ‌ని న‌మ్మేవాళ్లు కూడా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story