కరోనాకు మందులిస్తామని బాలికను తీసుకువెళ్లి..

కరోనాకు మందులిస్తామని బాలికను తీసుకువెళ్లి..
X

మహిళల కోసం ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా కొందరు మృగాల్లో మార్పు రావటం లేదు. మహిళలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నో కఠిన చట్టాలు తెచ్చింది. అయినా చిన్న పిల్లలపై, మహిళలపై తీవ్ర లైంగిక వేదింపులు జరిగుతునే ఉన్నాయి. తాజాగా కరోనా వైరస్‌ను నయం చేసే మందులను ఇప్పిస్తామని.. బాలికను తీసుకువెళ్లి సాముహిక అత్యాచారం చేశారు. చత్తీస్‌ఘడ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.

చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికకు కరోనా పాజిటివ్ అని ఇద్దరు యువకు భయపెట్టారు. కరోనా వైరస్‌ను నయం చేయడానికి దగ్గరలోని ఆసుపత్రి నుంచి మందులు ఇప్పిస్తామని నమ్మించి.. ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లారు. తరువాత ఆమెపై సాముహిక అత్యాచారం చేశారు.

తనపై జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది బోరున విలపించింది బాలిక. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేర.. పోస్కో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఓ బాలుడ్ని అరెస్టు చేశామని, మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వివరించారు.

Next Story

RELATED STORIES