ట్విట్టర్ లో ఎడిట్ ఆప్షన్.. కానీ ఓ కండిషన్..

సోషల్ మీడియా పుణ్యమా అని ఏదైనా విషయాన్ని ఒకేసారి వందల మందికి షేర్ చేయొచ్చు. ఇలా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్విట్టర్, ఫేస్ బుక్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే, మిగతా సోషల్ మీడియా ప్లాట్ ఫాంల కంటే.. ట్విట్టర్ కొంచెం భిన్నంగా ఉంటుందని చెప్పాలి. ఇందులో ఎక్కువగా అఫీషియల్స్ వాడుతూ ఉంటారు. అయితే, ట్విట్టర్ మినహా.. మిగతా ప్లాట్ ఫాంలు అన్నింటికీ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. కానీ, ట్విట్టర్ లో ఇలాంటి అవకాశం లేదు. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రాంలో ఏదైనా పోస్టు తప్పుగా చేశామని అనిపిస్తే.. దానిని వెంటనే ఎడిట్ చేసుకోగలుగుతాం. కానీ, ట్వీటర్ లో అలాంటి పొరపాటు జరిగితే.. ఆపోస్టు మొత్తం డిలీట్ చేసి.. మరోసారి పోస్టు చేయాలి. దీంతో చాలా మంది ట్విట్టర్ యూజర్లు ఎడిట్ ఆప్షన్ కావాలని గత కొంత కాలం నుంచి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఎట్టకేలకు దీనిపై స్పందించిన ట్విట్టర్ యాజమాన్యం ఎడిట్ ఆప్షన్ తీసుకొని వస్తామని తెలిపింది. కానీ, దానికి ఒక కండిషన్ పెట్టింది. అందరూ మాస్క్ పెట్టుకుంటేనే ఎడిట్ ఆప్షన్ ఏర్పాటు చేస్తామని ట్విట్టర్ అధికారిక ఖాతానుంచి ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. చాలా మంది దీనిపై ఫన్నీగా రీట్వీట్లు చేస్తున్నారు.
RELATED STORIES
China Corona: చైనా రాజధానిలో మళ్లీ లౌక్డౌన్.. ఇప్పటికే పలు జిలాల్లో...
23 May 2022 4:15 PM GMTNizamabad: రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసం.. రూ.5 కోట్లతో నిందితుడు...
23 May 2022 4:00 PM GMTUkraine: మరియుపూల్ తర్వాత లుహాన్స్క్ ప్రాంతంపై రష్యా దృష్టి..
23 May 2022 3:45 PM GMTNani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTYS Jagan: కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నాం- ...
23 May 2022 2:50 PM GMTRangareddy District: రెండో పెళ్లికి సిద్ధమయిన రైల్వే ఉద్యోగి.. ఇంతలోనే ...
23 May 2022 2:30 PM GMT