సోషల్ మీడియాలో అశ్లీల వీడియో పోస్టు చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్ట్

సోషల్ మీడియాలో అశ్లీల వీడియో పోస్టు చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్ట్
X

విద్యార్థులకు మంచి బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే బుద్ది మాలిన పనులు చేస్తున్నారు. పడకగదిలో ఓ మహిళతో కలిసి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ కీచక ప్రొఫెసర్. దీంతో ఆ ప్రొఫెసరును అరెస్టు చేసిన ఘటన అసోంలో చోటు చేసుకుంది.

అసోంలోని బార్పేట జిల్లాకు చెందిన ద్రుభజీత్ చౌదరి.. దిబ్రూఘడ్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. పడకగదిలో ఓ మహిళతో కలిసి ఉన్న వీడియోను అసిస్టెంట్ ప్రొఫెసర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ అశ్లీల వీడియోను మూడేళ్ల క్రితం చిత్రీకరించినట్లు అతడు పోలీసులకు తెలిపాడు. అశ్లీల చిత్రాలు షూట్ చేసిన కీచక ప్రొఫెసరుపై కఠిన చర్యలు తీసుకోవాలని యూనివర్శిటీ స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES