అంతర్జాతీయం

పాకిస్థాన్ విదేశాంగ మంత్రికి కరోనా పాజిటివ్

పాకిస్థాన్ విదేశాంగ మంత్రికి కరోనా పాజిటివ్
X

ప్రపంచ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇక పాక్‌లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం జ్వరం రావడంతో కరోనా పరీక్ష చేయించుకున్నానని తెలిపారు. రిపోర్టులో పాజిటివ్ గా వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు. కరోనా సోకినప్పటికీ ఇంటి వద్ద నుంచే అధికార విధులు నిర్వహిస్తానని ఖురేషి తెలిపారు.

Next Story

RELATED STORIES