తాజా వార్తలు

కరోనా ఫలితాల్లో గందరగోళం

కరోనా ఫలితాల్లో గందరగోళం
X

తెలంగాణ లో ప్రైవేటు ల్యాబులలో నిర్వహిస్తోన్న కరోనా టెస్టుల ఫలితాల్లో గందరగోళం నెలకొంది. మొత్తం 23 ల్యాబులలో పరీక్షలకు అనుమతించగా 13 ల్యాబుల ఫలితాలలో తప్పులు జరుగుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించి ఆయా ల్యాబుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. అందులో పనిచేసే కొంతమంది తప్పిదాల్ని సరిదిద్దుకున్నారని.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వెల్లడించారు. అతి త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని వెల్లడించారు.

కరోనా కోసం ప్రైవేటు మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వంతో జాయిన్ అయ్యాయని చెప్పారు. ఇదిలావుంటే రాష్ట్రంలో శనివారం కొత్తగా 1850 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 22,312కు చేరగా.. కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 5 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 288కు చేరింది. శనివారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 1572 కేసులు వచ్చాయి.

Next Story

RELATED STORIES