చైనాకు మరో గట్టి షాక్.. భారత్, అమెరికా బాటలో బ్రిటన్

చైనాకు మరో గట్టి షాక్.. భారత్, అమెరికా బాటలో బ్రిటన్

చైనాకు మరో షాక్ తగలనుంది. బ్రిటన్ లో 5జీ టెక్నాలజీని అభివృద్ది చేస్తున్న చైనా కంపెనీ హువావేకు చెక్ పెట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. చైనా కంపెనీతో దేశ భద్రతకు ముప్పుపొంచి ఉందనే అనుమానంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకూ చైనా కంపెనీ అమర్చిన పరికరాలు తొలగించడంతో పాటు.. మరో ఆరునెలల్లో బ్రిటన్ లో పూర్తిగా ఆ కంపెనీ సేవలు నిలివేందుకు సన్నాహాలు చేస్తుంది. అమెరికా కూడా చైనా టెక్నాలజీపై అనుమానం వ్యక్తం చేయడంతో బ్రిటన్ అదే బాటపట్టింది. హువావేపై అమెరికా ఆంక్షలు విధించి.. చైనా కంపెనీలకు తమ సంస్థల టెక్నాలజీ దొరక్కుండా అమెరికా జాగ్రత్తలు పడుతోంది. దీంతో ఎవరికీ తెలియని ఓ టెక్నాలజీని బ్రిటన్ లో వినియోగిస్తే.. తమ భద్రతకు పెద్దముప్పని సైబర్ సెక్యూరిటీ సెంటర్ భావిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story