బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన చైనా సూపర్‌ స్టార్‌

బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన చైనా సూపర్‌ స్టార్‌

ఒలింపిక్ లో చైనాకు రెండుసార్లు బ్యాడ్మింటన్ ఛాంపియన్ అవార్డులు అందించిన ప్రఖ్యాత షట్లర్, చైనా సూపర్‌ స్టార్‌ లిన్ డాన్ తన అభిమానులకు చేదువార్త వెల్లడించారు. సోషల్ మీడియా పోస్ట్‌లో శనివారం (జూలై 4) తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. ఈ సందర్బంగా పలువురికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘2000 నుంచి 2020 వరకు ఇరవై ఏళ్లు ఆటలో కొనసాగిన తాను జాతీయ జట్టుకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ విషయాన్నీ వెల్లడించడం తనకు బాధాకరమే అయినా తప్పలేదని అన్నారు. ప్రస్తుతం తన వయసు 37 ఏళ్లు అని.. తన శారీరక సామర్థ్యం, గాయాల దృష్ట్యా ఒకప్పటిలా జట్టు సహచరులతో కలిసి పోరాడలేనని.. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

టోక్యోలో తదుపరి ఒలింపిక్స్‌లో పాల్గొనలేనని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనను "సూపర్ డాన్" గా ఇలిచేవారు. చైనా బ్యాడ్మింటన్ తరఫున 20 సంవత్సరాల పాటు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. క్రీడా చరిత్రలో గొప్ప ఆటగాడు అయిన లిన్, 2006 మరియు 2013 మధ్య జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఐదు బంగారు పతకాలు మరియు ఆరు ఆల్ ఇంగ్లాండ్ కిరీటాలతో సహా అన్ని ప్రధాన టైటిళ్లను గెలుచుకున్నాడు. థామస్‌ కప్‌లో అరడజను బంగారు పతకాలు. 4 ఆసియా చాంపియన్‌షిప్‌ స్వర్ణాలు. 2 ప్రపంచకప్‌ విజయాలు ఉన్నాయి. మొత్తం 666 మ్యాచ్‌లలో విజయాలు సాధించారు.

Tags

Read MoreRead Less
Next Story