కరోనా వేళ.. బయటకు వెళ్తే రిస్క్ ఎంత

కరోనా వేళ.. బయటకు వెళ్తే రిస్క్ ఎంత

ఒకప్పుడు ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే సంతోషంగా ఉండేది.. ఎప్పుడూ మేమే రావాలా మీరు కూడా రావొచ్చుగా అంటే మనం కూడా వెళ్లే వాళ్లం.. ప్రస్తుతం ఎవరూ రాకుండా ఉంటే బావుండు అని అనుకుంటున్నాం. వాళ్లకి కరోనా ఉందేమో.. వాళ్లు ఉన్న ఏరియాలో కరోనా ఉందేమో అని భయపడలేక ఛస్తున్నాం. అనుమానం పెనుభూతం అంటారు. కానీ అనుమానించక తప్పని పరిస్థితి. వీళ్లు, వాళ్లు అని చూడకుండా అందర్నీ వరసబెట్టి పలకరించేస్తోంది కరోనా. ఎంతో అవసరమైతేనే బయటకు వెళ్లండి. వీలైనంత వరకు ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోండి అంటున్నారు. అది కొంత వరకు బెటరేమో. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అదే మంచిది. దూరంగా ఉండి పార్శిల్ తీసుకోవడం.. పార్శిల్ని శానిటైజ్ చేసి ఓపెన్ చేయడంతో కొంత వరకు కరోనా రాకుండా చూసుకోవచ్చంటున్నారు వైద్యులు.

పిల్లల్ని కిందకెళ్లి షటిల్ ఆడుకోమనడం, బండిలో పెట్రోల్ కొట్టించుకోవడం వంటివి ఎక్కువ రిస్క్ ఉండకపోవచ్చు. సూపర్ మార్కెట్ కి వెళ్లడం, వాకింగ్, రన్నింగ్, రెస్టారెంట్ కి వెళ్లడం, బిజీగా ఉండే రోడ్లపైకి వెళ్లడం ఇవన్నీ కొంత రిస్క్ తో కూడుకున్నవే. ఆఫీసులో భౌతిక దూరం పాటించకుండా పని చేయడం.. పెద్ద వారిని పరామర్శించడానికి వెళ్లడం వంటివి కరోనా త్వరగా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. సెలూన్ కి వెళ్లడం, పెళ్లి లేదా అంత్యక్రియలకు హాజరవడం వంటివి తప్పదనుకుంటేనే చేయాలి. బఫేలు, జిమ్ లు, ప్రార్థనాలయాలకు హాజరు, మ్యూజిక్ కాన్సర్ట్ ఇవన్నీ కరోనా వైరస్ వ్యాప్తికి అనువైన ప్రదేశాలు.. వీలైనంత వరకు వీటన్నింటినీ కొంత కాలం.. కరోనా ఉన్నంత కాలం మర్చిపోవాలేమో.. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటున్నారు వైద్యులు.

Tags

Read MoreRead Less
Next Story