'మర్డర్' సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

మర్డర్ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు
X

మర్డర్ సినిమా దర్శకుడు, నిర్మాతపై కేసు నమోదైంది. మిర్యాలగూడా పోలీస్ స్టేషన్‌లో నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. కోర్డు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశామని ఆయన తెలపారు. మర్డర్ సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన తరువాత.. సినిమా కోసం ప్రణయ్, అమృత, మారుతీరావు ఫోటోలు వాడారంటూ ప్రణయ్ తండ్రి బాలస్వామి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈమేరకు, సినిమా దర్శకుడు, నిర్మాతపై కేసు నమోదు చేయాలని మిర్యాల గూడా పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే, సినిమా షూటింగ్ నిలిపివేయాలని దాఖలు చేసిన పిటిషన్ కోర్టు నిరాకరించింది. ఇటీవల మర్డర్ పోస్టర్ ను రిలీజ్ తరువాత అమృత స్పందిస్తూ.. ఈ పోస్టర్ ను చూసిన తరువాత తనకు చనిపోవాలనిపించిదని తెలిపింది. అమృత వ్యాఖ్యలపై స్పందించిన రాంగోపాల్ వర్మ.. ఈ ప్రపంచం ఎవరూ చెడ్డవారు కాదని.. పరిస్థితులు మనుషులను చెడ్డవారిగా చూపిస్తాయని అన్నారు. ఈ సినిమాలో అలాంటి పరిస్థితులను ఈ సినిమాలో చూపించాలని అనుకుంటున్నాని అన్నారు. కానీ, ఏ ఒక్కరినో చెడ్డవారిగా చూపించే ప్రయత్నం నేను చేయడంలేదని వర్మ ట్వీట్ చేశారు.

Next Story

RELATED STORIES