Top

కరోనా లక్షణాలు లేకుండా 1,907 మందికి పాజిటివ్‌

కరోనా లక్షణాలు లేకుండా 1,907 మందికి పాజిటివ్‌
X

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. కరోనా వైరస్ బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రష్యాలో 6,611 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 1,907 మందికి ఎలాంటి లక్షణాలు లేకుండా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని సోమవారం అక్కడి సర్కార్ ప్రకటించింది.

ఒకవైపు కరోనా లక్షణాలతో ప్రజలు భయపడుతుంటే.. మరొవైపు ఎటువంటి లక్షణాలు లేకుండానే వెయ్యి మందికి పైగా కరోనా పాజిటివ్ రావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కాగా, రష్యాలో ప్రస్తుతం మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,87,862కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి135 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10,296కు చేరింది. దేశవ్వాప్తంగా ఇప్పటివరకు 4,54,329 మంది కరోనా బారి నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలియజేశారు.

Next Story

RELATED STORIES