కరోనాతో బుల్లితెర నటుడు మృతి

కరోనాతో బుల్లితెర నటుడు మృతి

కరోనా మహమ్మారి బారినపడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి సామన్యుడు నుంచి సెలబ్రిటీలకు వరకు అంందరినీ గజగజవణికిస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్‌లో కొందరు హీరోలు, హీరోయిన్లు కూడా కరోనా బారిన పడ్డి ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్లు బులితెర సెలబ్రెటీలను కూడా ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. తాజాగా కరోనా వైరస్‌తో బాధపడుతూ ప్రముఖ బుల్లితెర నటుడు నిక్‌ కార్డెరో కన్నుమూశారు. 41 ఏళ్ల నిక్ కరోనా వ్యాధి సోకి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

నిక్‌ కార్డెరో కరోనా వ్యాధి బారిన పడి 90 రోజుల పైనే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో లాస్‌ఏంజిల్స్‌లోని సెడార్స్ సినాయ్ ఆసుపత్రిలో ఆదివారం మరణించినట్లు అతని భార్య అమండా క్లూట్స్ తెలిపారు.

కరోనాతో బాధ పడుతున్న కార్డెరోను మార్చి30న ఐసీయూకు తరలించారు. అతనికి మినిస్ట్రోక్స్‌, రక్తం గడ్డకట్టడం, సెప్సిస్ ఇన్ఫెక్షన్లు, ట్రాకియోస్టోమీ, తాత్కాలిక పేస్‌మేకర్ ఇంప్లాంట్‌తో సహా పలు ఆరోగ్య సమస్యలు ఉండేవి. ఇన్‌ఫెక్షన్‌ కారణంగా కుడి కాలును కూడా కత్తిరించారు. ఊపిరితిత్తులకు సంబంధించిన సర్జరీ కూడా జరిగిందని ఇన్ని సమస్యలున్న కార్డెరోకు కరోనా సోకడంతో మృత్యువాత పడినట్లు వైద్యులు తెలిపారు.

నిక్‌ కార్డెరో​​ వెయిట్రెస్, ఎ బ్రోంక్స్ టేల్, బుల్లెట్స్ ఓవర్ బ్రాడ్‌వేతో సహా పలు హిట్ మ్యూజికల్స్‌లో నటించాడు.

Tags

Read MoreRead Less
Next Story