ఈసారి 27 అడుగులకే ఖైరతాబాద్‌ వినాయకుడు

ఈసారి 27 అడుగులకే ఖైరతాబాద్‌ వినాయకుడు

వినాయకచవితి వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో భక్తులందరి దృష్టి ఖైరతాబాద్ వినాయకుడిపై ఉంటుంది. ఈ ఏడాది ఎన్ని అడుగులు వుంటుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భారీ ఎత్తులో విభిన్న ఆకృతిలో కొలువుదీరే ఈ గణపతిని దర్శించుకోవడం కోసం ఏటా లక్షల మంది భక్తులు తరలివస్తారు. వినాయక చవితి ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఖైరతాబాద్ ప్రాంతం భక్తులు, సందర్శకులతో కిటకిటలాడుతుంది.

కానీ ఈసారి కరోనా ప్రభావంతో ఖైరతాబాద్ వినాయక ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 27 అడుగుల ఎత్తులో పూర్తిగా మట్టితో ధన్వంతరి వినాయకుడిని ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది. కాగా గత ఏడాది 65 అడుగులతో ద్వాదశాదిత్య మహా గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు పూజలు అందుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story