తాజా వార్తలు

విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలి : టీపీసీసీ చీఫ్

విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలి : టీపీసీసీ చీఫ్
X

లాక్ డౌన్ అమల్లో ఉన్న కాలానికి బిపిఎల్ కుటుంబాలతో పాటు ఎంఎస్ఎంఇల విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బందుల్లో ఉందని.. తెలంగాణ దీనికి మినహాయింపు కాదని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ కష్టకాలంలో ప్రజలకు సహాయపడటానికి ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకుంటున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఏమీ చేయడంలేదని ఆయన అన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ యొక్క 'ట్రేస్, టెస్ట్ అండ్ ట్రీట్' విధానం రాష్ట్రం అమలు చేయలేదని ఎత్తిచూపారు. ప్రభుత్వం వైరస్‌ను నియంత్రించడంలో విఫలమవ్వడమే కాకుండా పౌరులపై ఆర్థిక భారం కూడా విధించిందని ఆరోపించారు. జూన్ నెలలో విద్యుత్ బిల్లులు అన్యాయంగా ఉన్నాయని అన్నారు.

Next Story

RELATED STORIES