మరికొద్ది సేపట్లో పెళ్లి.. బ్యూటీపార్లర్‌కు వెళ్లిన వధువు హత్య

మరికొద్ది సేపట్లో పెళ్లి.. బ్యూటీపార్లర్‌కు వెళ్లిన వధువు హత్య
X

మరికొద్ది సేపట్లో పెళ్లి జరుగుతుందనగా.. అందంగా ముస్తాబు అయ్యేందుకు వధువు బ్యూటీపార్ల‌ర్‌కి వెళ్లింది. అయితే బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఆ న‌వ వ‌ధువు అక్కడే హత్యకు గురైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన చర్ఛనీయాంశమైంది.

రాట్లం జిల్లాలోని జోరా ప‌ట్ట‌ణానికి చెందిన యువ‌తికి మూడేళ్ల క్రితం ఓ ఫంక్ష‌న్ లో రాము అనే యువకుడు ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఈ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. మూడేళ్ల పాటు వీరిప్రేమాయణం సాఫిగా సాగింది. ఈ నేఫథ్యంలో కొన్ని కారణాల వల్ల వీరిద్ద‌రూ విడిపోయారు. అయితే ఇటీవ‌లే ఆ యువతికి వేరొక‌రితో పెళ్లి కుదిరింది. ఈ విష‌యం తెలుసుకున్న రాముకి ఆగ్ర‌హం కట్టలు తెచ్చుకుంది. ఎలాగైనా ఆమెను హత్య చేయాలని నిర్ణ‌యించుకున్నాడు.

మరికొద్ది సేపట్లో ఆ యువతికి వివాహం జరుగుతుందనగా.. అందంగా ముస్తాబు అయ్యేందుకు బ్యూటీ పార్ల‌ర్‌కి వెళ్లానుకుంది. ఆమె త‌న బంధువుతో క‌లిసి ఆదివారం ఉద‌యం జోరా ప‌ట్ట‌ణంలోని ఓ బ్యూటీ పార్ల‌ర్ లోకి వెళ్లింది. ఇదే స‌మ‌యంలో ఆ యువతికి రాము ఫోన్ చేశాడు. కానీ ఆమె నుంచి స‌మాధానం రాలేదు. దీంతో రాము ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే తన ఫ్రెండ్ పంచ‌ల్ ఫోన్ తీసుకుని ఆమెకు ఫోన్ చేశాడు. గుర్తు తెలియ‌ని నంబ‌ర్ అని భావించిన యువతి ఫోన్ లిఫ్ట్ చేసి తాను ఉన్న అడ్ర‌స్ చెప్పింది.

వెంటనే రాము, తన ఫ్రెండ్ పంచ‌ల్ క‌లిసి బైక్ పై బ్యూటీ పార్ల‌ర్ వ‌ద్ద‌కు వెళ్లారు. క‌త్తితో ఆ యువతి గొంతు కోసి రాము ప‌రారయ్యాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలను ప‌రిశీలించారు. ఆ ఫుటేజీల ఆధారంగా.. పంచ‌ల్ ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న రాము కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Next Story

RELATED STORIES