మాస్క్ పెట్టుకోకపోతే బస్ ఎక్కొద్దన్నందుకు డ్రైవర్ ని..

మాస్క్ పెట్టుకోకపోతే బస్ ఎక్కొద్దన్నందుకు డ్రైవర్ ని..

మాస్క్ పెట్టుకోవాలని ఎవరికి వాళ్లకి ఉండాలి.. కరోనా వస్తే మీరే కదా ఛస్తారు.. ఆ మాట అడిగినందుకు బస్ డ్రైవర్ ని చంపేశారు. అభివృద్ధి చెందిన ఫ్రాన్స్ దేశంలోనే పరిస్థితి అలా ఉంది. ఫ్రాన్స్ లోని బయోన్నేలో మాస్కు లేకుండా నలుగురు వ్యక్తులు బస్సు ఎక్కేందుకు ప్రయత్నించారు. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్క్ తప్పని సరిగా ధరించాలని ప్రభుత్వం రూల్ పెట్టింది. అయినా దాన్ని అతిక్రమించి బస్ ఎక్కడానికి వచ్చారు. డ్రైవర్ అదే విషయాన్ని ప్రశ్నించాడు. మాస్క్ పెట్టుకోపోతే బస్ ఎక్కడానికి వీల్లేదన్నాడు.

అంతే.. నలుగురు యువకులు కలిసి డ్రైవర్ ని విచక్షణా రహితంగా కొట్టారు. మెదడు దగ్గర బలంగా తగలడంతో డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. బస్సులోని మిగతా ప్రయాణీకులు వెంటనే డ్రైవర్ ని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. బ్రెయిన్ డెడ్ అయి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడి చేసిన వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గరు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు. డ్రైవర్ పై దాడికి దిగడాన్ని సహించని మిగతా ఉద్యోగులు సోమవారం విధుల్లోకి రాకుండా నిరసన వ్యక్తం చేశారు. దాంతో ప్రాంతీయ బస్సు సర్వీసులు నడవలేదు.

Tags

Read MoreRead Less
Next Story